డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ అడ్వైజర్‌‌కు కరోనా?

డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ అడ్వైజర్‌‌కు కరోనా?

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ అడ్వైజర్‌‌ రాబర్ట్‌ ఓబ్రెయిన్‌కు కరోనా సోకిందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. వైట్‌హౌజ్ అధికారుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన హయ్యస్ట్‌ ర్యాంకింగ్ అధికారి ఓబ్రెయిన్‌ కావడం గమనార్హం. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. ఓబ్రెయిన్‌కు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని మాత్రం పేర్కొంది.

‘ఓబ్రెయిన్‌ను సెల్ఫ్​ ఐసోలేషన్‌లో ఉంచాం. సెక్యూర్ లొకేషన్ నుంచి ఆయన పని చేస్తున్నారు. ప్రెసిడెంట్‌ లేదా వైస్ ప్రెసిడెంట్‌కు సోకే ప్రమాదం అయితే లేదు. దీని వల్ల నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పనులు కొంతమేర నిలిపేశాం’ అని శ్వేత సౌధం తెలిపింది. ఓబ్రెయిన్‌కు కరోనా సోకిన విషయాన్ని మొదట బ్లూమ్‌బర్గ్‌ న్యూస్ రిపోర్ట్‌ చేసింది. ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరైన తర్వాతే ఓబ్రెయిన్‌కు కరోనా సోకిందని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ప్రెసిడెంట్‌తోపాటు వైస్ ప్రెసిడెంట్‌కు కాంటాక్ట్‌లోకి వచ్చిన వైట్ హౌస్ సిబ్బందికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తున్నారు.