Fact Check : ట్రంప్ చనిపోయాడంటూ పోస్ట్.. అది కూడా కుమారుడి ట్విట్టర్ నుంచి.. అసలు కథ ఇదీ

Fact Check : ట్రంప్ చనిపోయాడంటూ పోస్ట్.. అది కూడా కుమారుడి ట్విట్టర్ నుంచి.. అసలు కథ ఇదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  చనిపోయాడంటూ ఆయన కుమారుడి ట్విట్టర్ నుండి  ఓ ట్వీట్ పోస్ట్ అయింది. ఇందులో  'నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ ఇక లేరని తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. నేను 2024 అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాను' అంటూ ఉంది. ఈ ట్వీట్ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందతా ఫేక్ అని  డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతా హ్యాక్  అయిందని తెలుస్తోంది.   

డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీట్ తో పాటుగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌పై దూషణలు రాస్తున్నారు. ఎలోన్ మస్క్ గురించి కూడా ఒక పోస్ట్ చేయబడింది. ఉత్తర కొరియా పరువు తీస్తుందని పోస్ట్ చేశారు. ఈ పోస్టులన్నీ చూస్తుంటే డోనాల్డ్ ట్రంప్ జూనియర్  అకౌంట్ హ్యాక్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది.  అయితే దీని వెనుక  ఎవరున్నారో తెలియాల్సి ఉంది.  

మరోవైపు తాను మరణించానంటూ సోషల్‌మీడియాలో వచ్చిన ప్రచారాన్ని ట్రంప్‌ ఖండించారు. కుమారుడి ఖాతా నుంచి పోస్టు వెలువడిన సుమారు అరగంట తర్వాత తన సొంత సోషల్‌ మీడియా వేదికగా  తాను బతికే ఉన్నానంటూ ట్రంప్‌ పోస్ట్‌ పెట్టారు.కాగా ఇప్పటికే  వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాను పోటీచేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.