నిమ్స్ ఆస్పత్రికి  బ్యాటరీ వాహనాల అందజేత 

నిమ్స్ ఆస్పత్రికి  బ్యాటరీ వాహనాల అందజేత 

పంజాగుట్ట, వెలుగు: రోగుల సౌకర్యార్థం  రూ. 23 లక్షల వ్యయంతో 14  సీట్లు గల రెండు బ్యాటరీ వాహనాలను  కరూర్ వైశ్యా బ్యాంక్ నిమ్స్ ఆస్పత్రికి అందజేసింది.  సోమవారం  కరూర్ వైశ్యా బ్యాంక్   డివిజనల్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు  నిమ్స్ డైరెక్టర్  నగర్ బీరప్ప కు  వాటి పత్రాలను అందజేశారు.

ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో   6 బ్యాటరీ వాహనాలు ఉండగా  మరో  రెండు అదనంగా సమకూరాయని  డైరెక్టర్ బీరప్ప తెలిపారు. కార్యక్రమంలో నిమ్స్ ఆస్పత్రి సూపరిండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.