కేసీఆర్ డెసిషన్.. వరద బాధితులకు BRS విరాళం

కేసీఆర్ డెసిషన్..  వరద బాధితులకు BRS విరాళం

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద వల్ల నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం వరద బాధితుల కోసం విరాళంగా ఇస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు విరాళం ప్రకటించనట్లు హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని తమ వంతుగా సాయం అందిచామన్నారు. అదే విధంగా సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక నెల జీతం ఖమ్మం వరద బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నాళాలు పొంగిపొర్లడంతో రహదారులు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకోగా.. వేల మంది నిరాశ్రయిలయ్యారు. ఇళ్లు, వాకిలి, కూడు, గుడ్డా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకుంనేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహయంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ విరాళంగా ప్రకటించారు.