కరోనాకు భయపడొద్దు ..డెత్‌రేట్ 2 శాతమే

కరోనాకు భయపడొద్దు ..డెత్‌రేట్ 2 శాతమే

రాష్ట్రంలో కరోనా డెత్ రేట్2 శాతమే అని, ఎవరు భయపడొద్ద్ద ని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుటుంటోందని, కరోనా పేషెంట్లను వెలివెసినట్లుచూడొద్దన్నారు.కరోనాతో సహజీవనం చేయక తప్పదని, సమస్యకు లాక్డౌన్ పరిష్కారం కాదని చెప్పారు. సోమవారం రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో కొవిడ్ ఐసోలేషన్ వార్డుతోపాటు ఐసీయూను కేటీఆర్ ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా విరాళంగా ఇచ్చిన ఐదు అంబులెన్స్లకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ధాపూర్లో 32 పడకల ఐసోలేషన్సెంటర్ను ఏర్పాటు చేశామని, సిరిసిల్లలో కూడా ఐసోలేషన్తోపాటు అత్యవసర చికిత్సవార్డును ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్లో అవసరం పడితే 6,000 మందికి ఐసోలేషన్ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే స్కూళ్లు, కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, హాస్టళ్లు, ఖాళీగాఉన్న ప్రభుత్వ బిల్డిం గ్స్ను వాడుకుంటామని చెప్పారు. ఇతర దేశాల కంటే మన దేశంలో కరోనా సమస్యతక్కువ ఉందన్నారు. సిరిసిల్లజిల్లాలో ఆస్పత్రి శానిటేషన్ సిబ్బందికి శాలరీలు పెంచి ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో ఆర్పీటీ సీఆర్ టెస్టులు రోజుకు 300 చేస్తున్నారని, వాటిని 1000కి పెంచాలన్నారు.ఇందుకు సంబంధించి కిట్లుపంపిస్తామని చెప్పారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, తన వంతుగారూ. 20 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ తప్పులు రాయండి

ప్రభుత్వ పక్షాన తప్పులు జరిగినప్పుడు మీడియా తప్పక రాయాలని, తాము సరిదిద్దుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలను భయాందోళనకు గురిచేసే ఆర్టికర్టిల్స్కాకుండా,ధైర్యంనింపే వార్తలు రాయాలన్నారు. రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని పేర్కొన్నారు.