
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల పేరుతో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కేసులు పెట్టాలని కోరారు. ఇలాంటి వ్యక్తుల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ ఉద్యోగం అయినా పరీక్షలు, అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగానే వస్తుందని తెలిపారు. మణుగూరులో తన సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు బయటపడిన నేపథ్యంలో దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని చెప్పారు.