
ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టే పనులు కేసీఆర్ మానుకోవాలన్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎర్రగడ్డ BRKR ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో నిర్వహించిన ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికుల పొట్టకొట్టి పరిపాలన చేస్తామని ప్రభుత్వం భావించడం న్యాయం కాదన్నారు.
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పండుగ కాదని.. ముందుంది ముసళ్ల పండగన్నారు కిషన్ రెడ్డి. సమస్య పరిష్కారానికి సీఎం చొరవ చూపాలన్నారు. కేంద్రంపై అనవసరంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కార్మికులను విధుల్లోంచి తొలగించమని కేంద్ర ప్రభుత్వం ఏ చట్టంలో చెప్ప లేదన్న కిషన్ రెడ్డి… వారితో చర్చించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉందన్నారు.