నన్ను గోల్డెన్​ లెగ్​ అనకండి : సంయుక్త మీనన్

నన్ను గోల్డెన్​ లెగ్​ అనకండి : సంయుక్త మీనన్

భీమ్లా నాయక్​తో టాలీవుడ్​కి పరిచయమైన సంయుక్త మీనన్​ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. తాజాగా విడుదలైన‘విరూపాక్ష’కు కూడా హిట్​ టాక్​ వినిపిస్తోంది. దీంతో ఈ బ్యూటీపై మరోసారి గోల్డెన్​ లెగ్​ అనే ముద్ర వేసేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్​ ఇంటర్వ్యూల్లోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి చాలా తెలివైన సమాధానం ఇచ్చింది.

‘సినిమా జయాపజయాలు హీరోయన్లపై ఆధారపడి ఉండవు. దీనికి వారిని బాధ్యులను చేయడం సరికాదు. సినిమా ఆడకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అందులో భాగం ఉంటుంది. హిట్​ అయినా అది టీమ్​ వర్క్​ వల్లే అవుతుంది. అంతేగానీ ఈ ఓల్డ్​ ఏజ్​ సెంటిమెంట్​ను నేను నమ్మను. ఇదొక చెత్త కాన్సెప్ట్’​ అంటూ చురకలు అంటించింది.