గొడ్డు మాంసం తిననన్న కంగన.. పాత ట్వీట్ను చూపించి ఉతికారేస్తున్న నెటిజన్లు

గొడ్డు మాంసం తిననన్న కంగన.. పాత ట్వీట్ను చూపించి ఉతికారేస్తున్న నెటిజన్లు

తాను గొడ్డు మాంసం తింటానని వస్తున్న వార్తలను నటి, మండి  బీజేపీ లోక్‌సభ అభ్యర్థి  కంగనా రనౌత్ ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. గొడ్డు మాంసం లేదా మరే విధమైన రెడ్ మీట్ నేను తినను. నాపై రూమర్స్ చేయడం సిగ్గుచేటని కంగనా అభిప్రాయడ్డారు.   తాను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నానని తెలిపారు.  త‌న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.   ప్రజలకు తానేంటో తెలుసునన్న కంగనా..  తాను గర్వించదగిన హిందువునని జైశ్రీరామ్ అంటూ ట్వీట్ చేశారు. 

అయితే  కంగనా ట్వీట్ పై  సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.  తాను గొడ్డు మాంసం తిననని ట్వీట్ చేసిన కంగన.. 2019 మే 19న ఇందుకు భిన్నంగా గొడ్డు మాంసం తినడం తప్పుకాదని, దానికి మతంతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లను పోల్చుతూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. 

కాగా కంగ‌నా ర‌నౌత్ ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజ‌య్ వాడెట్టివార్ ఆరోపించారు. ఏప్రిల్ 5న మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో వదేట్టివార్ మాట్లాడుతూ అవినీతి నాయకులందరినీ బీజేపీ స్వాగతం పలుకుతుందని ఆరోపించారు.  కాగా కంగనా రనౌత్ చివరిగా విడుదలైన చిత్రం తేజస్. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన ఎమర్జెన్సీలో ఆమె తదుపరి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు.