మాదాపూర్​లో భూమి కొంటే కోట్లొచ్చేవి : పవన్

మాదాపూర్​లో భూమి కొంటే కోట్లొచ్చేవి : పవన్

డబ్బుపై ఆశలేదు, దేశభక్తిలో సంఘ్​తో పోటీ పడలేం: పవన్​

తిరుమల, వెలుగు: ఆర్ఎస్ఎస్​లాంటి సంస్థల్లో దేశం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, అలాంటివాళ్లతో ఎవ్వరం పోటీపడలేమని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆత్మీయ యాత్రలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన పర్యటించారు. తనకు డబ్బే ప్రధానమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. ‘జానీ’ సినిమాకే తన రెమ్యునరేషన్‌‌‌‌ రూ.2 కోట్లు ఉండేదని, అప్పుడే మాదాపూర్‌‌‌‌లో 30 ఎకరాలు కొనుగోలు చేసుంటే ఈ పాటికి తాను వేలకోట్లకు అధిపతిని అయ్యేవాడినన్నారు. తనకు డబ్బు మీద ఎప్పుడూ ఆశలేదని చెప్పారు.

గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమమే

ఏపీ సీఎం జగన్ రెడ్డికి మతమార్పిడిల మీద ఉన్న ఉత్సాహం..  రైతుల సమస్యలపై లేదని పవన్ మండిపడ్డారు. మదనపల్లిలోని టమోట మార్కెట్ ను ఆయన సందర్శించారు. కొనుగోలుదారులు, వ్యాపారల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను రైతు కష్టం తెలిసినవాడిని.  టమోట పంట చేతికి రావాలంటే 70 రోజులు కష్టపడాలి. ఓ  ట్రే టమోట పండించాలంటే 450 రూపాయల ఖర్చవుతుంది.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి లేకుంటే ఉద్యమం తప్పదు” అని అన్నారు.

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా

చేనేత కార్మికులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. మదనపల్లెలో చేనేత కార్మికులను కలిసి వాళ్ల సమస్యలను అడిగి తెలుసకున్నారు. అన్ని ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలకు బదులు చేనేత వస్త్రాలు సమర్పించి చేనేత కళాకారులను ఆదుకోవాలని సూచించారు. చేనేతను బ్రాండ్ గా చేస్తే.. తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పారు. చేనేత కోసం మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో 4 లక్షల ఉద్యోగులను తీసేసి 2.80 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. 40 ఏళ్లున్న వెలుగు కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం