రెంటల్ డీడ్ నిబంధన ఎత్తివేయాలి ..తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వినతి

రెంటల్ డీడ్ నిబంధన ఎత్తివేయాలి ..తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వినతి

బషీర్​బాగ్, వెలుగు: బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ జీవోను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్​ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బార్ యజమానుల సమస్యలపై నాంపల్లి లోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో స్టాంప్ డ్యూటీ చెల్లించి అగ్రిమెంట్ చేసుకునే సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు రిజిస్ట్రీ తప్పనిసరి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. దీంతో బార్లకు స్టాక్ పంపించడం నిలిపివేశారని చెప్పారు. వైన్స్ షాపుల పర్మిట్ రూమ్‌‌లు పెద్ద స్థలాల్లో నడపడం వల్ల బార్లకు నష్టం జరుగుతోందన్నారు. వైన్స్​షాపులకు, బార్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా నిబంధన పెట్టాలని కోరారు.