సన్నిహితుడి ఇంట్లో అనుమానాస్పదంగా హెచ్ఆర్ మృతి

సన్నిహితుడి ఇంట్లో  అనుమానాస్పదంగా హెచ్ఆర్ మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. వనస్థలిపురంలోని సచివాలయా నగర్​లో ఉండే సంజన ప్రియ(36) చైతన్యపురిలో ఓ కన్సల్టెన్సీలో హెచ్ఆర్. 2011లో ఎలుక సంపత్‌‌‌‌కుమార్​తో పెండ్లి కాగా, 12 ఏండ్ల కొడుకు ఉన్నాడు. శనివారం ఆఫీస్​కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. 

మంగల్​పల్లి సమీపంలోని కసిరెడ్డి సాయినాథ్​రెడ్డి రూంలో రాత్రి ఫ్యాన్​కు ఉరేసుకుంది. తర్వాత సంజన ఫోన్​నుంచి ఆమె కుటుంబసభ్యులకు కాల్​వచ్చింది. సంజన మన్నెగూడలోని మహోనియా దవాఖానలో అపస్మారక స్థితిలో ఉందని, సాయినాథ్​రెడ్డి అనే వ్యక్తి తీసుకువచ్చి జాయిన్​ చేసి వెళ్లాడని చెప్పారు. దీంతో సంజన భర్త సంపత్​అక్కడికి వెళ్లగా చనిపోయిందని చెప్పారు. తన భార్య మృతికి సాయినాథ్​రెడ్డే కారణమని ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవితేజ  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.