బీఆర్​ఎస్, కాంగ్రెస్ ఉచితాలకు మోసపోవద్దు : లక్ష్మణ్

బీఆర్​ఎస్, కాంగ్రెస్ ఉచితాలకు మోసపోవద్దు :   లక్ష్మణ్

హైదరాబాద్ , వెలుగు: వేలం పాటలా బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉచిత స్కీమ్ లు ప్రకటిస్తున్నాయని, వాటికి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని బీజేపీ ఎంపీ లక్ష్మణ్   అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళుతున్న బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. 

ఈ నెల 7న హైదరాబాద్ లో జరగనున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలన్నారు. జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని, బీజేపీకి జనసేనకు పొత్తు ఖరారైందని, రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీతో ఎన్నికలకు కలిసి వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నాటకలో అక్కడి ప్రజలు బీజేపీ సర్కారే మేలని ఇప్పుడు అనుకుంటున్నారని,   కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయటం లేదని, ఉచిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు.