తెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

తెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలశాయాల నుంచి ఈ నీటి సంవత్సరం (2023–24) లో తెలంగాణ వాటాకు మించి నీటిని వాడేసిందని ఏపీ ఆరోపించింది. ఇకపై ఆ జలాశయాల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ని ఏపీ కోరింది.

 ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్​ శివ్​నందన్​ కుమార్​కు ఏపీ ఈఎన్​సీ సి.నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఈ నీటి సంవత్సరంలో రెండు జలాశయాల్లో 80 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించిన బోర్డు.. ఏపీకి 45 టీఎంసీలను, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించింది. అయితే ఇప్పటిదాకా తెలంగాణ 35.089 టీఎంసీలను వినియోగించుకుందని ఏపీ పేర్కొంది.