వ్యాక్సిన్ వచ్చేదాకా టోర్నీలుండవ్​!

వ్యాక్సిన్ వచ్చేదాకా టోర్నీలుండవ్​!

హైదరాబాద్‌‌కరోనా వైరస్‌‌ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్లన్నీ ఆగిపోయాయి. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.  జర్మనీకి చెందిన బుండెస్లిగా లీగ్‌‌ ఈ మధ్యే తిరిగి ప్రారంభమైంది. ఫ్యాన్స్​ లేకుండా ఖాళీ స్టేడియంలో ఆ లీగ్‌‌ జరుగుతోంది. మరి, వరల్డ్‌‌ వైడ్‌‌గా టోర్నీలు ఎప్పుడు రీస్టార్ట్‌‌ అవుతాయి? అంటే సమాధానం దొరకడం లేదు. ఇండియా వెటరన్‌‌ షట్లర్‌‌ పారుపల్లి కశ్యప్‌‌ మాత్రం కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్‌‌ వచ్చేంత వరకూ టోర్నీలేవీ జరుగబోవని అంటున్నాడు. ‘వ్యాక్సిన్‌‌ కనుగొనేంత వరకూ ప్రపంచం వ్యాప్తంగా ఏ ఒక్క టోర్నీ జరుగదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ఉంది. అంతా ఒకరకమైన భయంతో  ఉన్నారు. ట్రావెల్‌‌, క్వారంటైన్‌‌ ఆంక్షలు ఉంటాయి కాబట్టి పోటీలు  ఎలా జరుగుతాయో అర్థం కావడం లేదు.  ఆటగాళ్లే కాదు  ప్రతి స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్​ కూడా కన్ఫ్యూజన్‌‌తో ఉంది.

ఈ మహమ్మారి వైరస్‌‌ ఎప్పుడు అంతం అవుతుందో  స్పష్టంగా తెలిసేంత వరకు  అవి ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు’ అని 33 ఏళ్ల కశ్యప్‌‌ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ టోక్యో ఒలింపిక్స్‌‌ ఈ ఏడాదే జరిగి ఉంటే  కశ్యప్‌‌ క్వాలిఫై అయ్యే వాడు కాదు.  టోక్యో గేమ్స్‌‌ వచ్చే ఏడాదికి పోస్ట్‌‌పోన్‌‌ కావడంతో, పోటీలు తిరిగి మొదలైన తర్వాత  ర్యాంక్‌‌ ఇంప్రూవ్‌‌ చేసుకునే అవకాశం అతనికి లభించనుంది. అయితే, ఇప్పుడు ఒలింపిక్‌‌ క్వాలిఫికేషన్‌‌ ప్రాసెస్‌‌ ఎలా ఉంటుందో  తెలియడం  లేదని తెలుగు షట్లర్ అంటున్నాడు.  ‘నా ర్యాంక్‌‌ ఇంప్రూవ్‌‌ చేసుకోవాలంటే ముందుగా క్వాలిఫికేషన్‌‌ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే  దాని గురించి క్లారిటీ లేదు. మా ర్యాంకులనైతే ఫ్రీజ్‌‌ చేశారు కానీ, టోర్నమెంట్ల షెడ్యూల్‌‌ ఇంకా రాలేదు.  దీని గురించి ఎలాంటి చర్చ కూడా జరగలేదు.  మాకు మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆటలోనూ ఈ విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి.  మా ర్యాంకింగ్‌‌ ఫార్మాట్‌‌ను  దృష్టిలో ఉంచుకొని సరైన పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. కానీ, ఏ పరిష్కారం అయినా అందరికీ  న్యాయంగా ఉండబోదని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ర్యాంకింగ్స్‌‌ను అన్‌‌ఫ్రీజ్‌‌ చేయడం కొంతమంది ప్లేయర్లను బాధ పెడుతుంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై  బీడబ్ల్యూఎఫ్‌‌ చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది’ అని పారుపల్లి తెలిపాడు.

వంద శాతం ఆడాలంటే రెండు నెలలు పడుతుంది

చాలా రోజుల నుంచి వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న కశ్యప్‌‌ ఇంకా ఫుల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించలేదు. అయితే, కీలక సమయంలో ఇలా  ఫోర్స్‌‌డ్‌‌ బ్రేక్‌‌ వచ్చిందని, తాను కోలుకునేందుకు తగిన సమయం లభించిందని చెప్పాడు. అయితే, ఫుల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించాలంటే  మాత్రం కోర్టులో సరైన ట్రెయినింగ్‌‌ తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘ఇది (లాక్‌‌డౌన్‌‌) టఫ్‌‌ సిచ్యువేషన్‌‌. నేను ఉన్న చోట జిమ్​ కూడా అందుబాటులో లేదు. గోపీ సార్‌‌తో కలిసి ఆన్‌‌లైన్‌‌ సెషన్స్‌‌లో పాల్గొంటున్నాం. అలాగే మార్నింగ్‌‌ టైమ్‌‌లో  యోగా, ఎక్సర్‌‌సైజెస్‌‌ చేస్తున్నా.  అయితే, కోర్టులో మేం చేసేదానికి ఇవి దరిదాపుల్లో కూడా ఉండవు. నా వరకైతే కోర్టులో ట్రెయినింగ్‌‌ చాలా ఇంపార్టెంట్​. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు. సరైన ట్రెయినింగ్‌‌ లేకుండా కోర్టులోకి వెళ్తే  కనీసం నెల నుంచి రెండు నెలల వరకు నేను నా వంద శాతం ఆడలేను’ అని కశ్యప్‌‌ చెప్పుకొచ్చాడు.

రిటైరయ్యాక కోచ్‌‌ అవుతా

కెరీర్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించిన తర్వాత ఫుల్​టైమ్‌‌ కోచ్‌‌ అవతారం ఎత్తుతానని కశ్యప్‌‌ తెలిపాడు. ‘కోచింగ్‌‌పై నాకు చాలా ఇంట్రస్ట్‌‌ ఉంది. నా నెక్ట్స్‌‌ స్టెప్‌‌ అదే. దీని గురించి ఇంకా ఎవ్వరితో పూర్తిగా చర్చించలేదు.  కానీ, ఇకపై కూడా  బ్యాడ్మింటన్‌‌కు ఏదో ఒకటి చేస్తానని అనుకుంటున్నా. ఫ్యూచర్‌‌లో నెక్ట్స్‌‌ జనరేషన్‌‌ ప్లేయర్లకు హెల్ప్‌‌ చేస్తానేమో’ అని చెప్పాడు.

మా నుంచి అతిగా ఆశిస్తున్నారు

సైనా నెహ్వాల్‌‌, పీవీ సింధు వరల్డ్‌‌ బెస్ట్‌‌ షట్లర్లుగా ఎదిగినప్పటికీ.. గ్లోబల్‌‌ స్టేజ్‌‌పై ఇండియా షట్లర్ల ఓవరాల్‌‌ పెర్ఫామెన్స్‌‌ ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. అయితే, మన అథ్లెట్ల నుంచి ప్రజలు అతిగా ఆశిస్తున్నారని కశ్యప్‌‌ భావిస్తున్నాడు. ఇండియా ఇంకా స్పోర్టింగ్‌‌ నేషన్‌‌గా ఎదగలేదని అన్నాడు. ‘మాపై ప్రజల అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. కానీ, అంతకంటే ముందు ఒక స్పోర్టింగ్‌‌ నేషన్‌‌గా మనం ఎక్కడున్నామో చూడాలి.  ప్రపంచంలోని టాప్‌‌ స్పోర్టింగ్‌‌ నేషన్లతో మనల్ని పోల్చుకుంటున్నాం. కానీ, మనం ఆ స్థాయిలో లేము. ఇండియాలో  స్పోర్టింగ్‌‌ కల్చర్‌‌ లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒక సీనియర్‌‌ స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌గా, ఈ దేశం నుంచి ఎంతో  కొంత సాధించిన వాడిగా మనం అతిగా ఆశిస్తున్నామని  నేను ధైర్యంగా చెప్పగలను. కానీ, ఆ స్థాయిలో గ్రౌండ్‌‌ వర్క్‌‌ మాత్రం చేయడం లేదు. ఇండియా స్పోర్టింగ్‌‌ నేషన్‌‌ కాదు. మన దేశంలో ఇప్పటికీ స్పోర్ట్స్‌‌ ఫస్ట్‌‌ ప్రియారిటీ కాదు. గతంతో పోలిస్తే కొంత మెరుగవుతున్నా.. వెస్టర్న్‌‌ కంట్రీస్‌‌కు చాలా దూరంలో ఉన్నాం. 15, 20 ఏళ్ల క్రితం మా ఆటనే (బ్యాడ్మింటన్‌‌) చూస్తే ఒక్క గోపీ సార్‌‌ మాత్రమే ఉన్నారు. ఆయన తప్ప మరే విజేత కనిపించడు. ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ నెగ్గిన అనూప్‌‌ శ్రీధర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో క్వార్టర్‌‌ఫైనల్‌‌ వరకూ వెళ్లగలిగాడు. కానీ, ఇప్పుడు  వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో మనకు ఇద్దరు మెడలిస్ట్‌‌లు (సింధు, సాయిప్రణీత్‌‌) ఉన్నారు. డబుల్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ను విస్మరించలేం. మేం (షట్లర్లు) సాధించిన ఘనతలు అసాధారణం. అయినప్పటికీ, ఈ ఫలితాలతో ప్రజలు ఇంకా సంతృప్తిగా లేరని తెలిసి నేను ఆశ్చర్యపోతుంటా’ అని కశ్యప్‌‌ పేర్కొన్నాడు.

వరల్డ్‌ కప్‌ లేకపోతే ఐపీఎల్‌‌కు చాన్స్‌!