ఆ ముగ్గురు దోచుకున్న సొమ్ము కోసం లొల్లి పెట్టుకుంటున్నరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

 ఆ  ముగ్గురు  దోచుకున్న సొమ్ము కోసం లొల్లి పెట్టుకుంటున్నరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

 తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ కుటుంబం.. దోచుకున్న సొమ్ముకోసం లొల్లిపెట్టుకుంటున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలో 134 మందితో కూడిన నూతన ముదిరాజ్ మహిళా సంఘం ఏర్పాటు చేసిన సందర్భంగా మహిళలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు మహిళా సంఘం సభ్యులు.

 ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..గత ప్రభుత్వ హయాంలో  ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.  తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ ఫ్యామిలో దోచుకున్న డబ్బు కోసం లొల్లి పెట్టుకుంటున్నారు.  అన్నా, చెల్లి, బావ ముగ్గురు కోట్లాడుకుంటున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  మర్చిపోవద్దు..నిరుపేదల కోసం ఆలోచించే పార్టీ  కాంగ్రెస్ పార్టీ. మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లపుడూ అందుబాటులో ఉంటా. కాక స్పూర్తి తో ప్రజా సేవే చేసేందుకే  నేను ఉన్నా.

మహిళా సంఘాలు మహిళల ఆర్థికాభివృద్ధికి  ఉపయోగపడతాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.మహిళలందరికీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ముదిరాజ్ లకు సబ్సిడీ ద్వారా మత్స్యశాఖ వాహనాలు అందిస్తుంది.వాటిని సద్వినియోగం చేసుకోవాలి.  ఏ పని అయినా క్రమ శిక్షణతో చేయాలి.అప్పుడే విజయం సాధించడం సాధ్యం అవుతుంది.మహిళలు బిజినెస్ లో రోల్ మోడల్ గా నిలవాలి.21 వేల కోట్లు మహిళా సంఘాలకు కేటాయించింది. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తుంది.  ఇళ్లు కట్టుకున్న దర్వాత  ఇంట్లో కరెంట్ ఫ్రీ గా ఇస్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తుంది. అని వివేక్ వెంకటస్వామి అన్నారు.