Manchu Manoj: నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు.. మనోజ్ ఎమోషనల్

Manchu Manoj: నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు.. మనోజ్ ఎమోషనల్

‘మిరాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. శుక్రవారం (సెప్టెంబర్ 12న) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ అదిరిపోయిందని, విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవల్ అనే టాక్ వస్తోంది. ఇందులో తేజ సజ్జా (సూపర్ యోధా), మంచు మనోజ్ (మహావీర్‌ లామా)ల యాక్టింగ్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆడియన్స్ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మిరాయ్ తొలిరోజు రూ. 27కోట్ల గ్రాస్, రూ.12 కోట్ల నెట్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఈ సందర్భంగా మేకర్స్ ‘బ్రహ్మాండ బ్లాక్ బస్టర్’ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా మేకర్స్ తమ అభిప్రాయాలూ పంచుకుంటూ మిరాయ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

ఈ క్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాటల్లోనే.. ‘‘మిరాయ్ సక్సెస్ తో నేను ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. 12 ఏళ్ల తర్వాత అసలైన సక్సెస్‌ చూసాను. ఇందులో భాగంగానే విషెష్ చెప్పడానికి నా ఫోన్‌ మోగుతూనే ఉంది. అసలు నాకు ఇదంతా ఓ కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను.

ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళినా.. ‘అన్నా సినిమా ఎప్పుడు చేస్తావు? కమ్‌బ్యాక్ ఎప్పుడుంటుంది?’ అని అడిగేవారు. త్వరలోనే వస్తాను అని చెప్పేవాడిని. కానీ, వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినప్పటికీ.. లోపల ఏదో తెలియని భయం వెంటాడేది. ఈ క్రమంలోనే  చాలా సినిమాలు చివరి నిమిషంలో ఆగిపోయాయి కూడా.

అలా నేను ఒకటి అనుకుంటే మరోటి అయ్యేది. సరిగ్గా ఈ సమయంలోనే డైరెక్టర్ కార్తిక్‌ నన్ను నమ్మడం నా అదృష్టం. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారని’’ డైరెక్టర్ కార్తిక్‌కు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని.. డైరెక్టర్ మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా అందించారు. సినిమా విజువల్స్ ఇంత బాగొచ్చాయంటే అందుకు ముఖ్య కారణం రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ కార్తీక్ అవ్వడమే విశేషం.

కార్తీక్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రఫీగా వర్క్ చేశాడు. అందులో ‘సూర్య వర్సెస్ సూర్య , ప్రేమమ్, చిత్రలహరి, కృష్ణార్జున యుద్ధం, నిన్ను కోరి, ఎక్స్‌ప్రెస్ రాజా, కార్తీకేయ’ వంటి సినిమాలు ఉన్నాయి.