మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దు : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దు : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

షాద్​నగర్, వెలుగు: మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దని పాలమూరు ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ‘విష్ణు అన్న రాఖీ రక్షా కానుక’లో భాగంగా మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీలో 2 వేలకు పైగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలు, యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఎన్నికల ముందు మద్యం పోసి ఓట్లు అడిగే నాయకులతో మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల​ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమన్నారు. ఈ సందర్భంగా మోదీ ఫొటోకు మహిళలతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో  కన్వీనర్ అమడపురం నర్సింహా గౌడ్, సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, కొత్తూరు మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు