మోసం చేసే గెస్ట్ అప్పీయరెన్స్ అభ్యర్ధులను నమ్మొద్దు : సుధీర్ రెడ్డి

 మోసం చేసే గెస్ట్ అప్పీయరెన్స్ అభ్యర్ధులను నమ్మొద్దు : సుధీర్ రెడ్డి

మోసం చేసేగెస్ట్ అప్పీయరెన్స్ అభ్యర్ధులను నమ్మొద్దని ..  వారిని దూరం పెట్టాలని ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.  వాళ్లు గెలిచిన  నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని విమర్శించారు.  ఎల్బీ నగర్ లో పోటీ చేసేందుకు ఎక్కడెక్కడి నుండో  వచ్చి గెలిచి పత్తా లేకుండా పోతున్న లీడర్లను చాలా మందిని చూసామని అన్నారు.   అలాంటి వాళ్లకు ఓట్లేసి ప్రజలు మోసపోవద్దని సూచించారు.  

ఎల్బీ నగర్ చింతలకుంటలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనానికి  సుధీర్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కలిసికట్టుగా ఓట్లేసి గెలిపిస్తే.. మళ్లీ ఇటువైపు చూడనేలేదని ఎద్దేవా చేశారు.  ప్యారాషూట్ లాగా వచ్చే అభ్యర్ధులను నమ్మితే గోసపడతామని చెప్పారు.  తల ఒక రూపాయి తనకిస్తే నామినేషన వేస్తానని అన్నారు. వాటిని తాను ఆశీర్వాదంగా భావిస్తానని తెలిపారు.