
- బంగ్లా ప్రధాని షేక్ హసీనా
న్యూఢిల్లీ: ఉల్లి ధరల పెరుగుదల ఘాటు బంగ్లా ప్రధాని షేక్ హసీనాకూ తాకింది. ఇంట్లో తయారు చేసే కూరల్లో ఉల్లిని వాడొద్దని తమ వంటమనిషికి చెప్పానని హసీనా తెలిపారు. రేట్లు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా–బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడారు. దేశీయంగా ఉల్లిగడ్డల రేట్లు పెరిగిపోవడంతో ఎగుమతిని నిషేధిస్తూ ఇండియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల.. తమ దేశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘‘ఉల్లి ఎగుమతిని మీరు ఎందుకు నిలిపేశారో తెలియదు. మాకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే.. కొంత నిల్వ ఉంచుకునే వాళ్లం. భవిష్యత్తుల్లో ఇలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే.. కొంచెం ముందుగా మాకు చెప్పండి” అని కోరారు.