రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీలోకి రావొద్దు:ఉద్ధవ్ థాకరే 

రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీలోకి రావొద్దు:ఉద్ధవ్ థాకరే 

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, మహా వికాస్ అగాడీ (MVA) పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ వీడి వెళ్లిపోయిన ఎమ్మెల్యే లు పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి పార్టీ స్థానం లేదన్నారు. 2022లో పార్టీ విడిపోయిన తర్వాత ఉద్దవ్ థాకరే, అతని పార్టీ  తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. మహా వికాస్ అగాడీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు  ప్రత్యర్థి అయిన ఏక్ నాథ్ షిండే తో కలవడం.. థాకరే సీఎం పదవి కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. 
అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  మహా వికాస్ అగాడీ పార్టీ అత్యధికంగా సీట్లు సాధించి బలం పెంచుకుంది. దీంతో పార్టీనుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే.. షరద్ పవార్ లో కలిసి మీడియా సమావేశంలో  ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.