తమ్ముడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు : విజయ్ దేవరకొండ

తమ్ముడు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు : విజయ్ దేవరకొండ

రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ దొరసాని. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవరకొండ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. తన తమ్ముడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘అమెరికాలో డెలాయిట్‌లో ఆనంద్‌ పనిచేసేవాడు. సినిమాల్లో నటించాలనుందని చెప్పి.. వాడు ఇండియాకు వచ్చేయడం నాకు నచ్చలేదు. కానీ తప్పలేదు. వాడు ఫిక్స్ అయ్యాడు. నేనేం సపోర్ట్ చేయనని చెప్పాను. ఎందుకంటే వాడికి తెలియాలి సినిమా అంటే ఎంత కష్టమో. అందుకే నాకు టీజర్ షేర్ చెయ్యాలని ఉన్నా చేయలేదు. అమెరికాలో జాబ్ చేస్తూ నాకు డబ్బు పంపేవాడు. అది నాకు హెల్ప్ అయ్యింది. కష్టపడి ఇంజనీరింగ్ చేసి యూఎస్‌లో జాబ్ చేసి ఇండియాకి వచ్చేస్తా అంటే నాకు నచ్చలేదు’  అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు విజయ్‌.