మరిపెడ, వెలుగు : పేదల ఆకలి తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండలంలోని బురహాన్ పురం, తాళ్లఊకల్, బావోజిగూడెం, రాంపురం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తుచేశారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సీసీ రోడ్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

