
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ఈ సమయంలో మహమ్మారిపై పోరాటానికి కీలకమైన వ్యాక్సిన్ కొరత ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ విషయంపై సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. జూలై వరకు టీకా కొరత తప్పకపోవచ్చని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఓ జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. జూలైలో వ్యాక్సిన్ ఉత్పత్తి 70 మిలియన్ల నుంచి 100 మిలియన్ల డోసులకు పెరుగుతుందని పూనావల్లా చెప్పారని తెలిసింది. పూనావల్లా ప్రస్తుతం యూకేలో ఉన్నారు. కంపెనీ పార్ట్‌నర్స్, స్టేక్‌హోల్డర్స్‌తో ఆయన మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.