కొడుకు జ్ఞాపకాలు సజీవంగా ఉంచేందుకు ఓ తండ్రి తాపత్రయం

కొడుకు జ్ఞాపకాలు సజీవంగా ఉంచేందుకు ఓ తండ్రి తాపత్రయం

చనిపోయిన కొడుకు తమ మధ్య లేకపోయినా అతని జ్ఞాపకాలైనా సజీవంగా ఉండాలన్న తపనతో ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు. మామూలుగా సమాధులపై చనిపోయిన వారి ఫొటో, తేదీని వేస్తారు. కానీ ఈ తండ్రి మాత్రం కుమారుడి సమాధిపై క్యూ ఆర్ కోడ్ ను ప్రింట్ చేయించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఒమన్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోన్న ఫ్రాన్సిన్ 26ఏళ్ల కుమారుడు ఐవిన్ 2021లో బాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి, చనిపోయాడు.

చిన్న వయసులోనే మరణించిన ఐవిన్ మరణవార్తను జీర్ణించుకోలేని ఫ్రాన్సిస్.. కుమారుని జ్ఞాపకాలను మాత్రం సజీవంగా ఉంచాలనుకున్నాడు. డాక్టర్‌ ఐవిన్‌ జీవిత విశేషాలు, అతడి సృజనాత్మక ప్రతిభ తాలూకు వీడియోలు చూసేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసి దాన్ని ఓ వెబ్ సైట్ కు అనుసంధానం చేశాడు. ఐవిన్ సమాధిపై క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేయించాడు. దీన్ని స్కాన్ చేస్తే ఐవిన్ జీవితంలోని ఓ వెబ్ పేజీ ఓపెన్ అయ్యేలా క్రియేట్ చేశాడు. అందులో అతని ఫొటోలు, కాలేజీలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, అతని స్నేహితుల వివరాలు అన్నీ చూసేలా ఏర్పాటు చేశాడు.