కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి ముందు ఆందోళన

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి ముందు ఆందోళన

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బాధితులు ధర్నాకు దిగారు. తమకు ఇళ్లు ఇప్పిస్తామంటే కోటి నలభై లక్షల రూపాయలను దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు, కూతుర్ల సమక్షంలోనే ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తూ శనివారం వారి నివాసానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా బాధితులు. 

గత ఎన్నికల సమయంలో ఇండ్ల గురించి అడిగితే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇస్తామని హామినిచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, బ్లాక్ చేయడం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పులు చేసి, ఉన్న స్థలాలు అమ్ముకొని డబ్బులు ఇచ్చినట్లు చెబుతూ తమకు న్యాయ చేసేంతవరకు ఇక్కడి నుంచి కదలమని తేల్చి చెప్పారు.

 కాగా ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కూడా కొంతమంది డబుల్ బెడ్ రూమ్ లబ్దిదాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమను ఎంపిక చేసినా.. డబుల్ ఇండ్లు ఇవ్వలేదని ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేశారు.