అక్టోబర్​ 5న నాలుగో విడుతలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీ

అక్టోబర్​ 5న నాలుగో విడుతలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో గురువారం (అక్టోబర్​ 5వ తేదీన) నాలుగో విడుతలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. నాలుగో విడతలో 17 వేల 864 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 11 వేల 700, రెండో విడతలో 13 వేల 200, మూడో విడతలో 19 వేల 20 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేశారు. 

మూడు విడతల్లో 44 వేల ఇండ్లను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గడిచిన మూడు విడతల్లో మైనారిటీల రిజర్వేషన్ అంశం పరిగణలోకి తీసుకోకుండా డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేశారు. గురువారం (అక్టోబర్ 5న) రోజు ప్రభుత్వ GO 10,12 రూల్స్ కు లోబడి ఇండ్ల పంపిణీ జరుగుతుందా..? లేదా అనే ఆసక్తి నెలకొంది. గురువారం ఏడు చోట్ల మంత్రులు, జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్.. అధికారులతో కలిసి లబ్ధిదారులకు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేయనున్నారు.