
ఉస్తాద్ హీరో రామ్(Usthad Ram) మళ్ళీ ఇస్మార్ట్ లుక్ లోకి మారిపోయారు. ఇక ఇటీవలే రామ్, పూరి కాంబోలో డబుల్ ఇస్మార్ట్(Double ismart) పేరుతో ఒక మూవీ మొదలైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ప్రకటించారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో షూట్ కంప్లీట్ చేశామని, నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు తెలుపుతూ..రామ్ తో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేశారు ఛార్మి.
ఈ షెడ్యూల్ లో రామ్ అద్దిరిపోయే యాక్షన్ ఫైట్స్తో కుమ్మేసారని తెలుస్తోంది. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా కోసం మరోసారి రామ్ మాసీ అండ్ రగుడ్ లుక్ లోకి మారిపోయారు. మరోసారి పక్కా తెలంగాణ యాసలో ప్రేక్షకులను మేపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రామ్ మేకోవర్ కు సంబంధించిన వీడియో ను పూరి జగన్నాధ్(Puri Jagannadh) తాజాగా రిలీజ్ చేశారు. మొన్నటివరకు స్కంద సినిమా కోసం మాస్ లుక్ లో కనిపించిన రామ్.. మళ్ళీ ఇస్మార్ట్ లుక్ లో రివీల్ అయినా లుక్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.
అలాగే ఈ మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నారు. . ఇందులో బిగ్ బుల్గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.
పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్నడబుల్ ఇస్మార్ట్ 2024 ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలా సూపర్ సక్సెస్ అవుతుందా.. లైగర్ ఫ్లాప్ తో ఉన్న పూరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందిస్తుందా..అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.