వాల్యూయేషన్ క్యాంపులో లెక్చరర్లపై డబుల్ ఒత్తిడి

వాల్యూయేషన్ క్యాంపులో లెక్చరర్లపై డబుల్ ఒత్తిడి

ఇంటర్మీడియట్‍ ఫలితాలు ఏప్రిల్ 11 లోపు వెల్లడించడానికి ఇంటర్‍ బోర్డు అధికారులు తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు జరిగేలోపే ఇంటర్‍ ఫలితాలు ప్రకటిం చాలని అధికారులకు పైనుం చి ఆదేశాలు అందినట్లు సమాచారం. దాంతో ఇంటర్మీడియట్‍ పేపర్ల వాల్యూయేషన్‍ క్యాం పులో ఇప్పుడున్న స్పీడును రెట్టింపు చేయాలనే మెసేజ్ లు లెక్చరర్లకు పంపుతున్నారు. ఒక్కో లెక్చరర్‍ రోజుకు 45 ఆన్సర్‍ షీట్లు వాల్యూయేషన్‍ చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పైగా వాల్యూయేషన్ ప్రక్రియను పర్యవేక్షించే చీఫ్ ఎగ్జామినర్లు కూడా రోజుకు 15 స్క్రి ప్ట్ లు వాల్యూయేషన్ చేయాలని ఆదేశించడం వాల్యూయేషన్‍ ప్రమాణాలకు విరుద్దమని విద్యావేత్తలు అభిప్రాయబడుతున్నారు. పైగా సీఈలు ఎలాగూ వాటిని దిద్దే పరిస్థి తి క్షేత్రస్థాయిలో కన్పిం చడం లేదు. ఇవికూడా ఏఈలే దిద్దాల్సి న పరిస్థితులు కన్పిస్తున్నాయి. వేగంగా పరీక్షా పేపర్లను దిద్దితే పొరపాట్లు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో అంతిమంగా విద్యార్థులు మార్కులపై ప్రభావం పడి, వారు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్‍ బోర్డు ఫలితాల కంటే ముం దే ఫలితాలు ఇవ్వాలని తెలంగాణ ఆలోచన చేస్తూ ప్రత్యక్షంగా వాల్యూయేషన్‍ ప్రక్రియను పరోక్షంగా విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్నారు.

రోజుకు 45తో ఇబ్బందే….

వాల్యూయేషన్‍ క్యాంపు సైజ్ ను బట్టి 80 నుంచి 100 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. టేబుల్ కు 4 నుం చి 6 మంది సబ్జెక్టు లెక్చరర్లు(అసిస్టెంట్‍ ఎగ్జామినర్‍(ఏఈ)) స్టూ డెంట్స్ రాసిని పరీక్ష పేపర్లను దిద్దుతారు. ఈ ఏఈలను పర్యవేక్షించేందుకు టేబుల్ కు ఒక చీఫ్ ఎగ్జామినర్‍ (సీఈ) ఉంటారు. ఏఈలు ఎగ్జామ్‍ పేపర్లను సక్రమంగా వాల్యూయేషన్‍ చేస్తున్నారో లేదో సీఈలు వెరిఫై చేసి వచ్చిన మార్కులను ఆన్ లైన్ లో సబ్మిట్‍ చేస్తారు. వాల్యూయేషన్ క్యాంపులో ఒక్కో సబ్జెక్టు కు 2 నుం చి 3 సబ్జెక్టు నిపుణులు వాల్యూయేషన్‍ క్రతువును దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు . ప్రశాంత వాతావరణంలో పేపర్లను దిద్దాలని ఇంటర్‍ బోర్డు నిబంధనలు ఉన్నాకూడా ఇంటర్ అధికారుల క్యాంపు అధికారుల చేత ఏఈలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒత్తిడిలో వాల్యూయేషన్‍ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ టైం తీసుకొని రోజుకు 30 పేపర్లు దిద్దుతున్నామని ఇప్పుడు 45 పేపర్లు వాల్యూయేషన్ చేయాలనడం మాపై డబుల్ ప్రెషర్‍ పెట్టడమేనని వాల్యూయేషన్‍ క్యాం పులో పాల్గొంటున్న లెక్చరర్లు వాపోతున్నారు.

తప్పులు దొర్లితే భారీగా ఫైన్‍….

ఇంటర్ బోర్డు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక్కో ఏఈ మార్నింగ్‍ సెషన్ లో 15, మధ్యాహ్నం 15 పేపర్లను వాల్యూయేషన్‍ చేయాలి. ఇలా రోజుకు 30 పరీక్ష పేపర్లను అధికారుల నిర్దేశిం చిన టైంలో పూర్తి చేయాలి. ఇప్పుడు అధికారులు మాత్రం రోజుకు ఒక్కో ఏఈ 45 పేపర్లను ఖచ్చితంగా దిద్దాలని ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే ఒక్కో సీఈ 15 స్క్రి ప్ట్ లు వాల్యూయేషన్ చేయాలని తాజాగా నిర్దేశించారు. అసలు ఏఈలు దిద్దిన పేపర్లను సరిచూసే విధులకు పరిమితమైన సీఈలను ఎగ్జామినేషన్ పేపర్లను వాల్యూయేషన్ చేయమనడంతో అదనపు ఒత్తిడికి లోనవుతున్నారు. 30 స్టూ డెంట్‍ స్క్రి ప్ట్ చదివి వాల్యూయేషన్ చేసేందుకు ఒకరోజు సరిపోవడం లేదు. ఇప్పుడు మరింత వేగం పెం చాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఏఈలు వాపోతున్నారు. వేగంగా వాల్యూయేషన్‍ చేసే క్రమంలో తప్పులు దొర్లే అవకాశం ఉందని పైగా ఎవరైనా విద్యార్థులురీ వాల్యూయేషన్ కు నమోదు చేసుకున్నప్పుడు వారికి అదనపు మార్కుల కలిపిన పక్షంలో వాల్యూయేషన్‍ చేసిన ఏఈకి భారీగా ఫైన్ విధిస్తారు.