బీజేపీని గద్దె దించే వరకూ పోరాడుతాం

బీజేపీని గద్దె దించే వరకూ పోరాడుతాం

భూపాలపల్లి రూరల్, వెలుగు: కేంద్రంలో బీజేపీని గద్దె దించే వరకూ కాంగ్రెస్ పోరాటం ఆగదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  దేశవ్యాప్తంగా ఓట్​చోరీపై చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ టౌన్  ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన నాయకులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఓట్లు దొంగలించడం అంటే హక్కులను దొంగలించడమేనని పేర్కొన్నారు.  

కమాండ్ కంట్రోల్ సెంటర్​ ప్రారంభం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా  ఏర్పాటు చేసిన 160 అత్యాధునిక సీసీ కెమెరాలతోపాటు ఎస్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఎమ్మెల్యే సత్యనారాయణరావు గురువారం ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు, హాస్పిటల్స్, జెన్కో సహకారంతో రూ.30 లక్షలతో ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడి కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​తో లింక్ ఉంటుందని చెప్పారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని శాలువాలతో సత్కరించారు. డీఎస్పీ సంపత్​రావు, సీఐ నరేశ్​కుమార్ తదితరులున్నారు.