డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్..

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్..

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌ శంకర్‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు.  ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌కి మంచి రెస్పాన్స్ రాగా,  ఆదివారం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ మాస్ గెటప్‌‌లో ఎనర్జిటిక్‌‌గా కనిపిస్తున్నాడు.  ‘తలకి యూఎస్‌‌బీ పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. 

‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని తన క్యారెక్టర్‌‌‌‌లోని మాస్‌‌ను ఎలివేట్ చేయడం ఆకట్టుకుంది. హీరోయిన్ కావ్య థాపర్ సైతం యాక్షన్ మోడ్‌‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సంజయ్ దత్  బ్రెయిన్‍లోని  మెమొరీని రామ్ మెదడులోకి  పంపించడం మరింత ఆసక్తిగా ఉంటుంది. వీరిద్దరూ ఒకరినొకరు నేనంటే నేను బిగ్ బుల్ అని చెప్పుకోవడం, గన్స్ కాల్చిన తీరు సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.  అలీ డిఫరెంట్ గెటప్‌‌లో కనిపిస్తూ నవ్వించాడు. షియాజీ షిండే,  గెటప్ శ్రీను, ఝాన్సీ  ఇతర పాత్రలు పోషించారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.