ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే డబుల్ టోల్

ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే డబుల్ టోల్

ఫాస్ట్ ట్యాగ్ లేకుండా.. ఫాస్ట్ ట్యాగ్ లైనులోకి ప్రవేశించిన వాహనాలకు ఇక నుంచి డబుల్ టోల్ వసూల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ ర‌హ‌దారుల‌పై వెళ్లే వాహ‌నాల‌కు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ గత సంవత్సరమే త‌ప్ప‌నిస‌రి చేసింది. చెల్లుబాటులేని లేదా సరిగా కనిపించని ఫాస్ట్ ట్యాగ్ తో ఫాస్ట్ ట్యాగ్ లైనులోకి ప్రవేశించిన వాహనాలకు రెండు రెట్ల అధిక టోల్ విధించానున్నట్లు రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. వ్యాలిడెటీ లేని ఫాస్ట్ ట్యాగ్ తో కానీ లేదా పనిచేయని ఫాస్ట్ ట్యాగ్ తో కానీ ఫాస్ట్ ట్యాగ్ లైనులోకి వెళ్లరాదు. అలా వెళ్తే సాధారణంగా ఉండే టోల్ ఫీజు కన్నా డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వాహనదారులు తమ వాహనం యొక్క ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తుందో లేదో చూసుకున్న తర్వాతే టోల్ రోడ్డు ఎక్కితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్యాగ్ ను గత నవంబర్ మరియు డిసెంబరులలో దాదాపు 30 లక్షల వాహనాలకు వాటి యజమానులు తీసుకున్నారు. NHAI యొక్క అన్ని టోల్ ప్లాజాలలో డిసెంబర్ 15 నుండి ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత సేవలను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.

For More News..

ఆత్మాహుతి బాంబు దాడిలో సోమాలియా గవర్నర్ మృతి

మద్యం మత్తులో ఇద్దరిపై బ్లేడుతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు

ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’