Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'... ఫిబ్రవరిలో ‘Mega158’ లాంచ్!

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'... ఫిబ్రవరిలో ‘Mega158’ లాంచ్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా మళ్లీ మొదలైంది. ఒకవైపు సంక్రాంతి బరిలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో అలరించేందుకు సిద్ధమవున్నారు. మరోవైపు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'Mega158' అప్‌డేట్స్‌ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..

గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ముహూర్తం ఖరారు!

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం'Mega158'.  నిజానికి ఈ సినిమాను జనవరి 18నే ప్రారంభించాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే చిరంజీవి ఇటీవలే మోకాలి సర్జరీ చేయించుకోవడంతో .. ఆయన కోలుకోవడానికి  కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది.  మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఈ మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

క్రేజీ కాంబినేషన్స్?

ఈ ప్రాజెక్టులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, మోహన్ లాల్ కలిసి ఒకే ప్రేమ్ లో నిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు అభిప్రాపడుతున్నారు.  గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో చర్చించుకుంటున్నారు. 

 

►ALSO READ | Sreeleela: 24 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు అమ్మగా మారిన శ్రీలీల.. వైరల్ వీడియోతో మనసులు గెలిచేసింది

 

సంక్రాంతి బరిలో 'మన శంకర వరప్రసాద్ గారు'  

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న  'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది  పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇందులో చిరంజీవి ఒక మాజీ NIA ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార 'శశిరేఖ' సంపన్న యువతిగా మెగాస్టార్ సరసన నటిస్తోంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక కేమియో పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.

శ్రీకాంత్ ఓదెలతో మరో భారీ ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టు కేవలం బాబీతోనే కాకుండా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో ఉన్న శ్రీకాంత్, ఆ తర్వాత మెగాస్టార్‌ను వెండితెరపై సరికొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి 2026 సంవత్సరం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో, ఆ తర్వాత పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథలతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సునామీని కొనసాగించబోతున్నారు.