లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిలిటరీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అటాక్

లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిలిటరీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అటాక్
  • ఇటు కీవ్..  అటు లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆగని దాడులు
  • లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిలిటరీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అటాక్
  • మెరెఫా టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శతఘ్నులతో ఫైరింగ్.. 21 మంది దాకా మృతి
  • చెర్నిహివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కరోజులోనే పదుల సంఖ్యలో డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీలను మార్చురీలకు

లవీవ్: ఉక్రెయిన్ రాజధానిని చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యన్ దళాలు.. శుక్రవారం కూడా తమ దాడులను కొనసాగించాయి. కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివార్లలో మిసైళ్ల దాడులను, షెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా పెంచాయి. మరోవైపు పశ్చిమాన ఉన్న లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీపైనా బాంబుల వర్షం కురిపించాయి. కీవ్, ఖార్కివ్, ఒడెస్సా.. ఇలా ప్రతి చోట తెల్లవారుజాము నుంచే ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. బాంబులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇప్పటిదాకా రష్యా వెయ్యికి పైగా మిసైళ్లను ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైర్ చేసి ఉండొచ్చని అమెరికా అంచనా వేసింది.

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ కేంద్రంపై..

పశ్చిమాన, పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 70 కిలోమీటర్ల దూరంలోని లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయే ప్రజలకు.. దేశంలో ఉన్న వాళ్లకు సాయం చేసేందుకు వచ్చే వారికి, ఉక్రెయిన్ తరఫున పోరాడే వాళ్లు వచ్చేందుకు ఈ సిటీ కీలక కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే మిసైల్ దాడులు జరిగాయి. మిలిటరీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా అటాక్ చేసింది. నల్ల సముద్రం నుంచి మొత్తం 6 మిసైళ్లను ప్రయోగించగా.. ఒకటి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ రిపేర్ కేంద్రంపై, మరొకటి బస్ గ్యారేజీపై పడ్డాయి. దీంతో భారీగా నష్టం జరిగింది. ఒకరు గాయపడినట్లు రీజనల్ గవర్నర్ తెలిపారు. సిటీలో ఉదయం 6 గంటల టైంలో పేలుళ్లు సంభవించాయని, పేలుడు ధాటికి దగ్గర్లోని భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక బస్సు రిపేర్ చేసే కేంద్రం కూడా డ్యామేజ్ అయినట్లు లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్ అండ్రీ సడోవ్యీ తెలిపారు. 

బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ

అదనపు మిలిటరీ సాయం చేసినందుకు అమెరి కా అధ్యక్షుడు బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఆ సాయం ఏంటనేది బయటికి చెప్పలేదు. అది రష్యాకు తెలియడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ‘‘ఫిబ్రవరి 24న దాడి మొదలుపెట్టినప్పుడు.. 2014లో క్రిమియాను ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నట్లే ఇప్పుడు కూడా చేసుకోవచ్చని రష్యా అనుకుంది. కానీ రష్యా ఊహించిన దాని కంటే బలమైన రక్షణ వ్యవస్థ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉంది. అయితే మమ్మల్ని మేం రక్షించుకోవడానికి మా దగ్గర ఏం ఉంది? దాడిని ఎదుర్కొనేందుకు మేం ఎలా సన్నద్ధం అయ్యామనేది రష్యాకు తెలియదు” అని చెప్పారు. చర్చల్లో పురోగతి వచ్చినట్లు రష్యా, ఉక్రెయిన్ ప్రకటించగా.. తమ చర్చల వ్యూహాన్ని వెల్లడించబోమని జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ తెలిపారు. ‘‘టెలివిజన్, రేడియో, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంటే మౌనంగానే ఎక్కువ పని చేస్తున్నా. అదే సరైన మార్గంగా నేను భావిస్తున్నా” అని జెలెన్​స్కీ చెప్పారు.

కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనావాసాలపై..

కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనావాసాలపై దాడులు జరిగాయి. పలువురు చనిపోయినట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆఫీసర్లు తెలిపారు. బిల్డింగ్ శిథిలాల్లో చిక్కుకున్న సుమారు 100 మందిని కాపాడినట్లు వెల్లడించారు. క్రామాటోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో ఇండ్లపై జరిగిన దాడుల్లో ఇద్దరు చనిపోయినట్లు రీజనల్ గవర్నర్ పావ్లో కిరిలెంకో చెప్పారు. ఖార్కివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోని మెరెఫాలో రష్యన్ల ఆర్టిలరీ ధాటికి ఓస్కూలు, మరోకమ్యూనిటీ సెంటర్ ధ్వంసం అయ్యాయి. కనీసం 21 మంది దాకా చనిపోయారు. చెర్నిహివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కరోజులోనే పదుల సంఖ్యలో డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీలను మార్చురీకి తీసుకొచ్చారు. 

816 మంది మృతి: యూఎన్​

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 816 మంది ప్రజలు చనిపోయారని యునైటెడ్ నేషన్స్ శుక్రవారం తెలిపింది. 1,333 మంది గాయపడ్డారని చెప్పింది. రష్యా ప్రయోగించిన మిసైల్స్, బాంబుల దాడిలోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చంది. యుద్ధం భీకరంగా జరుగుతున్న మరియుపోల్ లాంటి కొన్ని సిటీల్లో ఎంతమంది చనిపోయారనేది కచ్చితంగా తెలియలేదంది.