1.4 లక్షల స్టార్టప్ కంపెనీలతో 15 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయ్: పార్లమెంట్లో కేంద్ర మంత్రి

1.4 లక్షల స్టార్టప్ కంపెనీలతో 15 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయ్: పార్లమెంట్లో కేంద్ర మంత్రి

ఢిల్లీ: భారత్లో జూన్ 30, 2024 నాటికి 1.4 లక్షల స్టార్టప్ కంపెనీలు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) గుర్తింపు పొందాయని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. ఈ స్టార్టప్ కంపెనీల ద్వారా 15.5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. పెట్టుబడులను ఆకర్షించి స్టార్టప్ కంపెనీల నెలకొల్పనకు అవకాశం ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్రలో 25,044 స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

also read : జీడీపీ వృద్ధి 7 శాతానికి పైనే : ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కర్నాటక (15,019), ఢిల్లీ (14,734), ఉత్తరప్రదేశ్ (13,299), గుజరాత్ (11,436) రాష్ట్రాలు భారత్లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలుగా నిలిచాయి. లక్షద్వీప్(3), సిక్కిం(11), లడక్(16), మిజోరం(32), అరుణాచల్ ప్రదేశ్(38), మేఘాలయ(52),  అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ (59), నాగాలాండ్(66)లో స్టార్టప్ కంపెనీలు అత్యల్పంగా నెలకొల్పబడ్డాయి.