అంబేద్కర్ లా కాలేజీకి న్యాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్

 అంబేద్కర్ లా కాలేజీకి న్యాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్
  • హర్షం వ్యక్తం చేసిన సరోజ వివేక్

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కళాశాల న్యాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాక్ గ్రేడ్ సాధించిన ఏకైక కాలేజీగా నిలిచింది. గడ్డం వెంకటస్వామి(కాకా) స్థాపించిన ఈ విద్యాసంస్థ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ, విలువలతో కూడిన విద్యతో ముందుకెళ్తున్న క్రమంలో న్యాక్ గ్రేడ్ రావడం సంతోషకరమని కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్  అన్నారు.

 విద్య అందరికీ దక్కాలనే లక్ష్యంతో కాక ఈ విద్యాసంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. ఇండియా టుడే సర్వేలో టాప్ 10లో అత్యున్నత కళాశాలగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ ఐదో స్థానం దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కాలేజీ మేనేజ్​మెంట్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కేక్ కట్ చేసి సంబురాలు
 జరుపుకున్నారు.