బెంగాల్​ గవర్నర్‌గా ఆనంద బోస్​.. 23న ప్రమాణం

బెంగాల్​ గవర్నర్‌గా ఆనంద బోస్​.. 23న ప్రమాణం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా  నియమితులైన డాక్టర్ సీవీ ఆనంద బోస్ నవంబర్ 23న కోల్‌కతాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఆనంద బోస్  బెంగాల్ గవర్నర్ గా నియమితులైనట్లు ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుండి ప్రకటన వెలువడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్‌దీప్ ధన్ కర్..  బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా వేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఆప్పటినుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్  బెంగాల్‌కు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. 

ఆనంద బోస్ 1977 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మాజీ అధికారి. భారత ప్రభుత్వ కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన కార్యదర్శిగా ఆయన గతంలో పనిచేశారు.  అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. సీవీ ఆనంద బోస్ మంచి రచయిత కూడా. ఆయన  ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో 32 పుస్తకాలను రచించారు.