మల్కాజిగిరి, వెలుగు: విద్యార్థులకు ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణంలో చదివే సదుపాయం కల్పించడం విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కాప్రా డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ‘రాధా స్టడీ హాల్స్’ను మంగళవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హాల్స్‌లోని వసతులను పరిశీలించి, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు గౌడ రాధ, గౌడ రవి కిరణ్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రశాంతంగా చదివేందుకు ప్రత్యేక స్థలం అవసరమని, ఇటువంటి స్టడీ హాల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బొంతు శ్రీదేవి యాదవ్, స్టడీ హాల్స్ నిర్వాహకులు రాధ, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
