బీజేపీ నుంచి రాణాప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌

బీజేపీ నుంచి రాణాప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌

నర్సంపేట, వెలుగు : డాక్టర్‌‌‌‌‌‌‌‌ గోగుల రాణా ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు అతడి నలుగురు అనుచరులను బీజేపీ నుంచి సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. నర్సంపేటలోని బీజేపీ ఆఫీసులో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో పార్టీ ఆఫీసులో మీటింగ్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్న టైంలో రాణాప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి అనుచరులు తడుక అశోక్, చేపూరి నాగరాజు, పాలడుగుల జీవన్‌‌‌‌‌‌‌‌, గడ్డం ఆంజనేయులు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేయడం, నాయకులను తిట్టడం సరికాదన్నారు. దాడిని తీవ్రంగా పరిగణిస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ తీర్మానించిందన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్​రెడ్డి, నాయకులు వడ్డేపల్లి నర్సింహారావు, బాల్నె జగన్, చిలువేరు రజనీభారతి, వనపర్తి మల్లయ్య, కూనమళ్ల పృథ్వీ, రవీందర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.