హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డా.కోట రామారావు

హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డా.కోట రామారావు

హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును ఫైనల్ చేసింది పార్టీ అధిష్టానం. గత కొన్ని రోజులుగా అభ్యర్థిత్వంపై ఉన్న ఉత్కంఠ తొలగింది. యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి కోట రామారావు. పాలకులు అభివృద్ధిని పట్టించుకోవటం లేదని విమర్శించారు. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తే.. తనను గెలిపిస్తుందని తెలిపారు రామారావు.

రామారావు ప్రొఫైల్:

గరిడేపల్లిమండలం, కేతవారిగుండం గ్రామస్తులు కీ.శే కోట రంగయ్య, నరసమ్మ దంపతులకి, 1978, మే, 12 న  జన్మించాడు.

వారితండ్రి గ్రామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా మూడు సార్లు ఎన్నికయ్యారు. ఒకసారి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేసారు.

కాలేజీ రోజుల్లో రామారావు ABVP నాయకుడిగా సేవలు అందించారు.

పేద ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో మెడిసిన్ చదివి డాక్టర్  అయ్యారు.  ప్రభుత్వ డాక్టర్ గా కొంతకాలం  ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేశారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన బిల్ గేట్స్ స్థాపించిన మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో కొంతకాలం పనిచేశారు.
హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు. ఎన్నో మెడికల్ క్యాంపులు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించారు. కొన్ని వేలమందికి ఉచిత వైద్యం అందించారు.

ప్రజలకి మరింత సేవ చేయాలి అంటే, రాజకీయాలే సరైన మార్గమని భావించి, BJPలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.