డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (DRRMLIMS) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: నర్సింగ్ ఆఫీసర్ 422 (అన్ రిజర్వ్డ్ 169, ఓబీసీ 114, ఎస్సీ 88, ఎస్టీ 09, ఈడబ్ల్యూఎస్ 42).
ఎలిజిబిలిటీ, వయోపరిమితి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీలకు 708. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జనవరి 08.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ ఎగ్జామ్, మెయిన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు drrmlims.ac.in వెబ్సైట్ను సందర్శించండి.

