V6 News

వరంగల్ NITలో టీచింగ్ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చదివినోళ్లకు అవకాశం..

 వరంగల్ NITలో టీచింగ్ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చదివినోళ్లకు అవకాశం..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT WARANGAL) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31.

పోస్టుల సంఖ్య: 45. 

పోస్టులు: ప్రొఫెసర్ 02, అసోసియేట్ ప్రొఫెసర్ 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– I 08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– II 27. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి బి.కాం., బీఎస్సీ, బి.టెక్./ బీఈ, ఎంఎస్సీ, ఎం.టెక్./ ఎంఈ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంసీఏ, పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– IIకు 35 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– Iకు 40 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్​కు 45 సంవత్సరాలు, ప్రొఫెసర్​కు 50 సంవత్సరాలు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 08.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1000. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 31.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ అప్లికేషన్స్ వెరిఫికేషన్ ద్వారా షార్ట్​లిస్టింగ్ చేస్తారు. అవసరమైతే బోధన & పరిశోధన సెమినార్ ప్రదర్శన ద్వారా మరింత షార్ట్​లిస్ట్ చేస్తారు. షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

►ALSO READ | 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు వచ్చేశాయి.. దరఖాస్తులు షురూ..