కెనడాలో డాక్టర్ రెడ్డీస్ సెమాగ్లుటైడ్ మందు

కెనడాలో డాక్టర్ రెడ్డీస్ సెమాగ్లుటైడ్ మందు

న్యూఢిల్లీ:  ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్  టైప్-2 డయాబెటిస్‌‌ చికిత్సలో ఉపయోగించే  సెమాగ్లుటైడ్  ఇంజెక్షన్ జెనరిక్ వెర్షన్‌‌ను కెనడాలో శనివారం లాంచ్ చేసింది. హెల్త్ కెనడా నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28న అనుమతి  పొందిన తర్వాత, ఈ జెనరిక్ ఇంజెక్షన్‌‌ను ప్రవేశపెట్టింది.  

సెమాగ్లుటైడ్‌‌కు మార్కెట్ అనుమతి ఇచ్చిన మొదటి జీ-7 దేశం కెనడా కావడం విశేషం.   టైప్-2 డయాబెటిస్ ఉన్న పెద్దవారి రక్తంలో చక్కెర స్థాయిలను ఈ ఇంజెక్షన్ నియంత్రిస్తుంది. దీనిని వారం వారం వేసుకోవాల్సి ఉంటుంది.  

డాక్టర్ రెడ్డీస్  ఇటీవల భారతదేశంలో ఒబెడ  బ్రాండ్ పేరుతో ఈ మందును  లాంచ్ చేసింది.  భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లలో జీఎల్‌‌పీ1 థెరపీలను విస్తరించడమే లక్ష్యమని సంస్థ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయేలీ తెలిపారు.