
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌గా నికర లాభం 2 శాతం పెరిగి రూ.1,413 కోట్లకు చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్లో రూ.1,379 కోట్ల లాభాన్ని గడించింది. ఆదాయం 2023 డిసెంబర్ క్వార్టర్‌లోని రూ.7,215 కోట్ల నుంచి రూ.8,359 కోట్లకు పెరిగిందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా మార్కెట్ల నుంచి ఆదాయాలు పెరగడం ఇందుకు కారణమని, కొత్తగా కొనుగోలు చేసిన ఎన్ఆర్సీ వ్యాపారం, కొత్త లాంచ్‌ల వల్ల రెండంకెల వృద్ధిని సాధించామమని కంపెనీ ఎండీ జీవీ ప్రసాద్ అన్నారు.