ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు

 ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు

దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  ఒమిక్రాన్ వేరియంట్ కూడా  వ్యాపిస్తోంది. మరోవైపు డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరం కాదంటూ పలువురు వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే ఒమిక్రాన్ ను ఏమాత్రం లైట్ గా తీసుకోవద్దని డాక్టర్ తన్మయ్ మోతీవాలా హెచ్చరించారు. జోధ్ పూర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో  ఆయన పిల్లల విభాగంలో డాక్టర్ గా పని చేస్తున్నారు. గత బుధవారం ఆయన కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ కు సంబంధించి పలు విషయలు తెలిపారు
 
ఐసీయూలో ఉన్న ఓ పేషెంతో కాంటాక్ట్ లోకి వచ్చి తర్వాత  కొంచెం తలనొప్పి వచ్చిందని... ఆ తర్వాత శరీరం బలహీనంగా అనిపించింనట్లు తెలిపారు  మోతీవాలా. ఇది స్పష్టమైన లక్షణంగా అన్పించడంతో .. వెంటనే  సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానన్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ గా నేను సేవలందిస్తూనే ఉన్నా... గతంలో కూడా డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అయితే ఈసారి కరోనా బారిన పడుతున్న డాక్టర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో మొత్తం డిపార్ట్ మెంట్ కు కరోనా సోకుతోందని.. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమన్నారు.

రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవారికి తక్కువ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి వారు ఇతరులకు హానికరంగా మారతారన్నారు. రోగ నిరోధకశక్తి ఎక్కువ ఉన్నవారు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు... కానీ వారి ప్రియతములకు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి వారు ప్రమాదకరంగా మారుతారని తెలిపారు.  డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కు మధ్య తేడాను గుర్తించడం కష్టమని.. కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రుల్లో  చేరితే... రెగ్యులర్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అందరూ ఇంటి దగ్గరే వద్దే ఉంటూ, మాస్కును ధరించడం మంచిదని సూచించారు డాక్టర్ తన్మయ్ మోతీవాలా.

 

మరిన్ని వార్తల కోసం..

శివరాజ్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని సీఎం అయ్యిండు