
రిచర్డ్ రిషి లీడ్ రోల్లో చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బకాసురన్’ ఫేమ్ మోహన్ జి దర్శకుడు. గతంలో ఇదే దర్శకుడు తెరకెక్కించిన ‘ద్రౌపతి’ చిత్రానికి ఇది సీక్వెల్. సోమవారంతో ఈ మూవీ షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. నిర్మాత ప్యాషన్‌వల్ల చాలా గ్రాండ్‌గా షూటింగ్ చేయగలిగాం. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తీస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అన్నారు.
నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘అనుకున్న దానికంటే ముందే షూటింగ్ పూర్తయింది. ప్రేక్షకులను14వ శతాబ్దంలోకి తీసుకెళ్లి, ఆనాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నం’ అన్నారు. రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, దివి, దేవయాని ఇతర పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.