ఝరాసంగం, వెలుగు: మహిళా సంఘాలు సభ్యులు ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీవో జ్యోతి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మండల సమాఖ్య ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలకు చైర్మన్ గా అవకాశం కల్పించడమే కాకుండా వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం భాగయ్య, సీసీలు మిట్టప్ప, అమృత, తుక్కమ్మ, ఎస్తేర్ రాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
