కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ అన్మోల్ బిష్ణోయ్కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇంతకాలం అక్రమంగా అమెరికాలో దాక్కున్న బిష్ణోయ్ పై నిషేధం విధించడంతో ఇండియా కు వచ్చాడు. వచ్చీరాగానే ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బిష్ణోయ్ అమెరికా ఎలా వెళ్లాడు.. ఇంతకాలం ఎలా అక్కడ ఉండగలిగాడు అనే కోణంలో విచారణ చేస్తే సంచలన విషయాలు బయటికొచ్చారు.. సోషల్ మీడియాలో బిష్ణోయ్ కి సంబంధించిన పాస్ పోర్టు వైరల్ అవుతోంది..
సోషల్ మీడియాలో బిష్ణోయ్ కి చెందిన నకిలీ పాస్ పోర్టు వైరల్ అవుతోంది. ఆ పాస్ పోర్టు 2021లో జారీ చేశారు. అయితే బిష్ణోయ్ అసలు పేరుతో కాకుండా వేరే వ్యక్తి పేరుతో నకిలీ పాస్ పోర్టుపై అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది..
వైరల్ అవుతున్న పాస్ పోర్టులో బిష్ణోయ్ పేరు భాను ప్రతాప్ గా ఉంది.. ఈ నకిలీ పాస్ పోర్టుతోనే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశాంచాడని ఆరోపణలు వస్తున్నాయి.
అన్మోల్ బిష్ణోయ్ ఫోటోతో కూడిన పాస్ పోర్టులో.. పాస్ పోర్టు హోల్డర్ పేరు భాను ప్రతాప్ అని పేరెంట్స్ రాకేష్, సమిత్రాదేవి అని ఉన్నాయి డాక్యుమెంట్లో డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 15, 2000గా రిజిస్టర్ అయి ఉంది.
గతేడాది నవంబర్ లో అన్మోల్బిష్ణోయ్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. అయితే భారత్ లో జరిగిన నేరాలకు సంబంధించి కాకుండా అమెరికాలో అక్రమంగా ప్రవేశించినందుకు అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన కొద్ది సమయంలోనే బిష్ణోయ్‌ను అరెస్ట్ చేశారు.
బుధవారం (నవంబర్19న) ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన బిష్ణోయ్ ని ఎన్ ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికానుంచి బహిష్కరించిన వెంటనే బిష్ణోయ్భారత్ వచ్చాడు.. సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు బిష్ణోయ్ ని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలో ని పాటియాల కోర్టులో హాజరు పర్చారు.
#WATCH | Wanted gangster Anmol Bishnoi brought to Delhi's Patiala House court after he was arrested by NIA upon his extradition to India from the US pic.twitter.com/M3fNK1vV9r
— ANI (@ANI) November 19, 2025
బిష్ణోయ్ పై పలు రాష్ట్రాల్లో డజనుకు పైగా కేసులున్నాయి. ఎన్ ఐఏ విచారణ తర్వాత వివిధ కేసులో విచారణకు ఆయా రాష్ట్రాల పోలీసులకు అప్పగించనున్నారు.
