
ఒక ఆదర్శ ప్రయత్నంలో పుణెకు చెందిన పక్షి పరిశీలకుల బృందం ఒక అరుదైన పక్షిని కనిపెట్టింది. ఈ పక్షి కనుమరుగైపోతున్న టాప్ 10 పక్షుల లిస్టులో ఉంది. అయితే దాదాపు ఒక దశాబ్దానికి పైగా ఈ పక్షి జాడ లేదు. అంకితభావం, దృఢ సంకల్పం ఉంటే ఎంత గొప్ప విజయమైన సాధించవచ్చో అని ఈ పక్షి ప్రేమికులు నిరూపించారు.
నిజానికి, ఈ బృందంలో ఒకరైన హరీష్ తంగరాజ్, పుణెలోని పక్షి ప్రేమికుల కోసం ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో జెర్డాన్స్ కోర్సర్(Jerdon’s Courser) పక్షి అరుపును విన్నానని, రికార్డ్ కూడా చేశానని చెప్పగానే అందరిలోనూ ఉత్సాహం, ఆసక్తి పెరిగింది. ఆగస్టు 23 నుండి 31 వరకు జరిగిన ఓ యాత్ర కోసం హరీష్ తంగరాజ్, ఆదేశ్ శివకర్, రోనిత్ ఉర్స్, శశాంక్ దల్వి, ప్రణవ్ కలిసి ఓ టీం ఏర్పాటు చేసుకున్నారు.
16 ఏళ్ల తర్వాత మళ్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో 16 ఏళ్ల తర్వాత, అలాగే 125 సంవత్సరాల తర్వాత అభయారణ్యనికి కిలోమీటర్ల దూరంలో కనిపించకుండా పోయిన ఈ అరుదైన పక్షి అరుపును హరీష్ తంగరాజ్ ఆగస్టు 24న సౌండ్ రూపంలో రికార్డ్ చేశాడు. సింద్ వుడ్‌పెక్కర్, లాంగ్-బిల్డ్ బుష్ వార్బ్లెర్ లేదా LBBW పక్షులు కనిపించిన తర్వాత, ఈ జెర్డాన్స్ కోర్సర్ కనిపించడం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ పరిరక్షకులకు, పక్షి ప్రేమికులకు ఒక సానుకూల సంకేతం.
ALSO READ : జొమాటో హెల్తిఫైతో న్యూట్రిషన్ గుట్టు రట్టు..
1986లో భరత్ భూషణ్ స్థానిక గైడ్ సహాయంతో శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో 86 సంవత్సరాల తర్వాత అంతరించిపోయినట్లు భావించిన జెర్డాన్స్ కోర్సర్‌ను కనిపెట్టాడు. 1994-95లో ఈ పక్షి లంకమల్లేశ్వర ప్రాంతంలోనే కనిపించింది, ఆ తర్వాత చాల జిల్లాల్లో దీని కొసం వెతకడం ప్రారంభించారు.
అటవీ శాఖ రక్షణ చర్యలు : ఈ పక్షి ప్రేమికులు పక్షి అరుపులను రికార్డ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం, పక్షిని ఫోటో తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే దీన్ని అంతరించిపోతున్న పక్షి జాతిగా పరిగణించి తగిన రక్షణ కల్పించనున్నారు ఇంకా సరైన నియమ నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ఇలా చేయడం వల్ల చాలా సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన అరుదైన పక్షి జాతులను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
'కల నిజమైంది - 125 సంవత్సరాల తర్వాత లంకమల్ల పర్యటన వద్ద మొదటి రోజే జెర్డాన్స్ కోర్సర్ కనిపెట్టాను ! అనే పోస్ట్‌లో... నేను చాలా సంవత్సరాలుగా ఈ జాతి పక్షి గురించి చాలా మందితో చర్చించాను. నెలలు, సంవత్సరాలుగా దాని కోసం వెతుకుతున్న పరిశోధకులు మాత్రమే ఈ అంతుచిక్కని పక్షిని కనుగొనగలరని, లేదంటే అది అంతరించిపోయిందనే భావన ఉండేది. ట్రావెలింగ్ బర్డ్ వాచర్లు ఈ పక్షిని వెతకగలరని నేను ఎప్పుడూ నమ్మలేదు." అని అన్నారు.
ఈ పక్షి ' కనిపెట్టాల్సిన ప్రపంచంలోని టాప్ 10 అరుదైన పక్షులు' లేదా 'ప్రపంచంలో కనిపించకుండా పోయిన టాప్ 10 పక్షులు' లిస్టులో ఉండటం వల్ల వనరులను కేటాయించడానికి కూడా చాలా మంది భయపడ్డారు.
ఆగస్టు 24 సాయంత్రం అంతరించిపోయిందనుకున్న పక్షి జెర్డాన్స్ కోర్సర్ భారతదేశానికి, ప్రపంచానికి కనిపించకుండా పోయిందన్న ఈ పక్షి, దాదాపు రెండు దశాబ్దాలలో మొదటిసారిగా ఇంకా చరిత్రలో శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో దాని ఏకైక ప్రదేశంలో మొదటిసారిగా అరుపు వినిపించి రికార్డ్ అయ్యింది.. ఇది వరుసగా మూడు సార్లు దాని ప్రత్యేకమైన అరుపును ఇచ్చింది అని చెప్పారు.