Malavika Mohanan: చిరుతో కాదు.. ప్రభాస్ సరసన చేస్తున్నా.. పుకార్లకు చెక్ పెట్టిన మాళవిక మోహనన్!

Malavika Mohanan: చిరుతో కాదు.. ప్రభాస్ సరసన చేస్తున్నా.. పుకార్లకు చెక్ పెట్టిన మాళవిక మోహనన్!

వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నుంచి రాబోయే ప్రతి సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఆయన లైన్ లో ఉన్న  డైరెక్టర్ బాబీ చిత్రంపై వస్తున్న పుకార్లపై ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్ మాళవిక మోహనన్ క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి సరసన నటించడంపై సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  ఇప్పుడు ఆ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వరుసలో భారీ ప్రాజెక్టులు

ప్రస్తుతం చిరంజీవి..  అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ' మన శంకరవరప్రసాద్ గారు' మూవీలో నటిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది కాకుండా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర' కూడా లైన్‌లో ఉంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా ఈ చిత్రం ఆలస్యమవుతోంది. మొదట సంక్రాంతికి రావాల్సి ఉన్నా, గ్రాఫిక్స్ పనుల కోసం సమయం తీసుకుని, వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది.

బాబీ డైరెక్షన్ లో 'మెగా 158'

అయితే 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో 'మెగా 158' చిత్రం రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది. ఇందులో తమిళ హీరో కార్తీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ స్వయంగా మాళవికనే స్పందించింది.

►ALSO READ | Prabhas vs Don Lee : ప్రభాస్‌కు విలన్‌గా కొరియన్ సూపర్‌స్టార్ డాన్ లీ.. ఇంటర్నేషనల్ క్లాష్ ఫిక్స్!

 క్లారిటీ ఇస్తూ ట్వీట్.. 

లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది.'హాయ్ గైస్, బాబీ సర్ దర్శకత్వంలో రూపొందనున్న 'మెగా 158'లో నేను నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  నా కెరీర్‌లో ఐకానిక్ చిరంజీవి సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులో నేను భాగం కాదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ వార్తలు అవాస్తవం. అని సోషల్ మీడియా ఖాతాలో క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. మాళవిక మోహనన్ ప్రకటనతో, 'మెగా 158'లో అసలు కథానాయిక ఎవరనే దానిపై ఇప్పుడు మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని, అనుష్క శెట్టి పేరు కూడా పరిశీలనలో ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 

శ్రీకాంత్ ఓదెలతో మరో యాక్షన్ మూవీ

ఈ రెండు భారీ ప్రాజెక్టులతో పాటు, 'దసరా' ఫేమ్ యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే, చిరంజీవి అభిమానులకు నాన్‌స్టాప్ ఫెస్ట్ రెడీ అవుతోంది.